Friday, 25 May 2018

సూక్తులు



మీ చేతులను సేవకు, మీ హృదయాన్ని ప్రేమకు ఉపయోగించండి ..మదర్ థెరిస్సా

నేను బతికినన్నాళ్లు నేర్చుకుంటూనే ఉంటాను ...రామకృష్ణ పరమహంస

బలమే జీవనం. బలహీనతే మరణం. స్వామి వివేకానంద

లేని గొప్పదనం ఉందని చెబితే ఉన్న గొప్పదనం కాస్తా ఊడిపోతుంది .మహాత్మాగాంధీ

ప్రేమ అనేది మాటలతో వచ్చేది కాదు మదర్ థెరిస్సా

నమ్మకమున్న వాడే అన్నీ ఉన్నవాడు-- రామకృష్ణ పరమహంస

ఈ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అదే జరిగిపోతాయి .స్వామి వివేకానంద

మనిషి ఎప్పుడు సత్యాన్ని పలికితేనే సత్య పురుషుడు అయినా పరమాత్ముడిని దర్శించగలడు --రామకృష్ణ పరమహంస

విమర్శ ఒక్కోసారి నిన్ను బాధించవచ్చు కానీ అదే నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా రూపు దిద్దుతుంది .విన్స్టన్ చర్చిల్

నీకోసం జీవిస్తే నీలోనే నిలచిపోతావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు --అంబేద్కర్

మార్పుకి అజ్ఞానం భయపడుతుంది .జవహర్లాల్ నెహ్రూ

ఎంత ప్రచారం చేసినా అధర్మం ధర్మం కాదు --మహాత్మాగాంధీ

పరాజయం నుండి గుణపాఠం నేర్చుకోవాలి. విజయం నుండి వినయం నేర్చుకోవాలి.

ఓటమి ఎదురవగానే నిరాశ చెందకూడదు అది కొత్త ప్రేరణకు పునాది కావాలి --జవహర్లాల్ నెహ్రూ

మరణించడం కన్నా యాతనలను అనుభవించడానికే మనిషికి ఎక్కువ సాహసం కావాలి-- నెపోలియన్

మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం-- చేగువేరా

కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా  లేస్తున్నందుకు --వివేకానంద 

మనస్ఫూర్తిగా పనిచేయనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు అబ్దుల్ కలాం

పరిస్థితులు ఎంత దారుణంగా నైనా ఉండని నేను అవకాశాలను సృష్టించు కుంటా--- బ్రూస్లీ

విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది ---మహాత్మాగాంధీ

మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో నిండి ఉండాలి-- మదర్ థెరిస్సా

విప్లవాలు, నేరాలు, పేదరికం  నుంచే పుట్టుకొస్తాయి అరిస్టాటిల్

అబద్ధానికి వేగం ఎక్కువ. నిజానికి ఓపిక ఎక్కువ.
సహాయం చేసి మర్చిపో సహాయం పొందితే గుర్తుంచుకో --మహాత్మాగాంధీ

ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వితే అదే వారికి నువ్విచ్చే బహుమతి ___మదర్ థెరిస్సా

Thursday, 17 May 2018

మీకు తెలుసా????





*   పాములకు రెక్కలు, రెప్పలు చెవులు ఉండవు .

*   తాబేలుకు కళ్ళు ఉండవు.

*   నత్త రక్తం నీలం రంగులో ఉంటుంది.

 *  మొసలి తన దవడ పైభాగాన్ని కదల్చ గలదు.

*   నీటి ఏనుగు చమట  ఎరుపు రంగులో ఉంటుంది.

*    జలగకు 10 కన్నులు ఉంటాయి.

*   పక్షులకు మూత్రపిండాలు( కిడ్నీలు) ఉండవు.

*   గుర్రం తన జీవితకాలమంతా నిలబడే ఉంటుంది.

*   ఆడదోమలే మనుషులను కుడతాయి.

*   తేనెటీగకు ఐదు కన్నులు ఉంటాయి .

*  కివి పక్షి కి అసలు రెక్కలు ఉండవు.



Wednesday, 16 May 2018

మీకు తెలుసా???




*    తేనెటీగలు గంటకి ఎన్ని కిలోమీటర్లు వేగంతో                  ఎగురుతాయి?
     
       24 కిలోమీటర్లు


*     మనిషి తన జీవితకాలంలో సుమారుగా ఎంతకాలం          ఫోన్ మాట్లాడతాడు?

        సుమారుగా రెండేళ్లపాటు .


*    ఇండియాలో మొదటి తపాలా కార్యాలయం ఎక్కడ           ఏర్పడింది?

       1727 కోల్ కత్తా ఏర్పడింది.

*    కోళ్లు ఎన్నిరకాల శబ్దాలను చేయగలవు?
   
       30 రకాలు.
*     అన్ని జంతువులలో కంటే ఏ జంతువుకీ రక్తపోటు             ఎక్కువ

        జిరాఫీ

*      ప్రపంచంలో అతిపెద్ద విత్తనం ఏది?
         
        కొబ్బరికాయ

*      గోల్డ్ ఫిష్ చీకటిలో రంగు మార్చుతుంది.

*      చైనా జాతీయ క్రీడ టేబుల్ టెన్నిస్.

*      అప్పుడే పుట్టిన కంగారు పిల్ల ఒక చెంచా లో                    పట్టేటంత చిన్నదిగా ఉంటుంది

*      మొసలి నూరు సంవత్సరాల వరకు బ్రతికి ఉంటుంది

Thursday, 10 May 2018

తెలుగు సామెతలు. {IDIOMS}


  1. మనిషికో మాట- గొడ్డుకో దెబ్బ.
  2. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
  3. మట్టిలో మాణిక్యం.
  4. మనోవ్యాధికి మందు లేదు.
  5. మనువు ఒకచోట- మనసు ఒకచోట.
  6. మనసుంటే మార్గం ఉంటుంది.
  7. మహా వృక్షం కింద మొక్కలు పెరగలేవు.
  8. బూడిదలో పోసిన పన్నీరు.
  9. భోగం దాని మాటలు బంగారానికే.
  10. బెల్లం ఉన్నచోటే ఈగలు వాలేది.
  11. బ్రాహ్మణుని చెయ్యి, ఏనుగు తొండం ఊరుకోవు.
  12. బ్రహ్మ రాసిన రాత మారదు.
  13. బ్రహ్మచారి ముదిరినా ,బెండకాయ ముదిరినా పనికిరాదు.
  14. బయట పులి -ఇంట్లో పిల్లి.
  15. బడాయి బావగారు- మెల్లకన్ను మరదలు.

Wednesday, 9 May 2018

తెలుగు సామెతలు (Idioms)

  1. అత్త మీద కోపం దుత్త మీద చూపించాడట.
  2. అడ్డులేని పెత్తనం- అదుపులేని గుర్రం ఒక్కటే.
  3. అత్తకు ఆరాటం- కోడలకు కోలాటం.
  4. అడుక్కునేవాడికి 60 ఇల్లు.
  5. అటు గొయ్యి ఇటు  నుయ్యి.
  6. అడ్డం అంటే  తెడ్డెం అంటాడు.
  7. ఇంటి గుట్టు రట్టు.
  8. ఇన్నాళ్లూ బ్రతికి ఇంటి వెనక చచ్చినట్టు.
  9. ఇంట్లో ఇల్లాలి పోరు ,బయట బాకీల పోరు.
  10. ఇప్ప చెట్టుకు నిచ్చెన వేసినట్లు...
  11. ఈత కొట్టే వాడికే లోతు తెలుస్తుంది.
  12. ఉన్న మాటంటే ఉలుకెక్కువ.
  13. ఉల్లి చేసే మేలు ,తల్లి కూడా చేయదంటారు.
  14. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు.
  15. ఉరిమిన మబ్బు లన్ని కురవవు.

తెలుగు సామెతలు



 అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు.


దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు.

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు.

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం.

దున్నపోతు మీద వర్షం పడ్డట్టు.

ఎవరికి వారే యమునా తీరే.

కుక్క కాటుకు చెప్పు దెబ్బ.

నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు.

కోటి విద్యలు కూటి కొరకే.

అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు.

అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని.

అందరూ పల్లకి ఎక్కితే మోసేది ఎవరు.

అందని ద్రాక్ష పళ్ళు పుల్లన.

అగ్నిలో ఆజ్యం పోసినట్లు.


అందితే జుట్టు, అందకపోతే కాళ్లు.

Sunday, 6 May 2018

పొడుపు కథలు ...చెప్పుకోండి చూద్దాం






తెల్లటి పొలంలో నల్లని విత్తనాలు
 చేత్తో చల్లుతారు నోటితో ఏరుకుంటారు...
 ఏమిటది????

 జవాబు పుస్తకం

అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది
 మా ఇంటికొచ్చింది మహాలక్ష్మి లాగుంది ..
ఏమిటది ????




 జవాబు గడప

అందరిని పైకి తీసుకు వెళతాను కానీ నేను పైకి వెళ్లలేను.....



జవాబు నిచ్చెన

ఆకు చిటికెడు.. కాయ  మూరడు ఏమిటది???




 జవాబు మునక్కాయ

కుడితి తాగదు మేత మేయదు కానీ కుండడు పాలు ఇస్తుంది... ఏమిటది????


 జవాబు తాడిచెట్టు

సన్నని స్తంభం ...ఎక్కలేరు దిగలేరు..
 ఏమిటది???


 జవాబు సూది

కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు
 అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు
 ఏమిటది ????


జవాబు నత్త

తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర ..
ఏమిటది ???




జవాబు కొవ్వొత్తి

సూక్తులు

మీ చేతులను సేవకు, మీ హృదయాన్ని ప్రేమకు ఉపయోగించండి .. మదర్ థెరిస్సా నేను బతికినన్నాళ్లు నేర్చుకుంటూనే ఉంటాను ... రామకృష్ణ పరమహంస...