Friday, 4 May 2018

పొడుపు కథలు చెప్పుకోండి చూద్దాం

               చెప్పుకోండి చూద్దాం......


సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊళ్లోకి వచ్చే అరిచేది..... ఏమిటది ??????


జవాబు :శంఖం

స్నానం చేస్తే తడవని స్థలం ఏది ?????


జవాబు: నీడ

హస్త ఆరు పళ్ళు చిత్తు మూడు పాళ్ళు....ఏమిటది?????




 జవాబు   :వర్షం

రూపం ఉండి హృదయం లేనిది... ఏమిటది?????
జవాబు: శిల్పం

రూపాయి వెడల్పు గజం లోతు.... ఏమిటది????



 జవాబు: జంతికల గొట్టం

2 పద్మాలు ఒకే పద్మములో .... ఏమిటవి????



 జవాబు: కళ్ళు


మూడు కండ్ల వారు ముక్కంటి మరి కాదు-- తలకు పిలక యుండు తాత కాదు--- తాత గుడికి పోవా తలకాయ పగిలేలా..... ఏమిటది ????

జవాబు : కొబ్బరికాయ

మూట విప్పితే కెంపులు .....ఏమిటవి ????

జవాబు: దానిమ్మ గింజలు



No comments:

Post a Comment

సూక్తులు

మీ చేతులను సేవకు, మీ హృదయాన్ని ప్రేమకు ఉపయోగించండి .. మదర్ థెరిస్సా నేను బతికినన్నాళ్లు నేర్చుకుంటూనే ఉంటాను ... రామకృష్ణ పరమహంస...