Tuesday, 1 May 2018

పొడుపుకథలు.... చెప్పుకోండి చూద్దాం

                 చెప్పుకోండి చూద్దాం     


అమ్మ అంటే కలుస్తాయి నాన్న అంటే కలవవు.... ఏమిటవి????

జవాబు: పెదవులు



అరచేతి కుంకుమ-- అందమైన కుంకుమ --బీరాకు కుంకుమ-- సొగసైన కుంకుమ.... ఏమిటది????

 జవాబు: గోరింటాకు


ఆకాశాన అంబు-- అంబులో చెంబు --చెంబులో చారెడు నీళ్లు.. ఏమిటది????

 జవాబు టెంకాయ

ఆకులేని అడవిలో జీవం లేని జంతువు-- జీవమున్న జంతువులను వేటాడుతుంది...ఏమిటది????


 జవాబు: దువ్వెన


ఇంటిలో మొగ్గ... వీధిలో పువ్వు..... ఏమిటది????



జవాబు: గొడుగు


ఇచ్చేవాడు వాడే --పుచ్చుకునేవాడు వాడే.... ఏమిటది???


జవాబు: చెయ్యి


ఉరిమిన అప్పుడే పూచు పువ్వు ఏది భువిలోన... ఏమిటది ????

జవాబు : పుట్టగొడుగు

ఎక్కలేని చెట్టుకు గుట్టల కొద్దీ పూలు ...ఏమిటవి???


జవాబు: నక్షత్రాలు

No comments:

Post a Comment

సూక్తులు

మీ చేతులను సేవకు, మీ హృదయాన్ని ప్రేమకు ఉపయోగించండి .. మదర్ థెరిస్సా నేను బతికినన్నాళ్లు నేర్చుకుంటూనే ఉంటాను ... రామకృష్ణ పరమహంస...