Tuesday, 1 May 2018

పొడుపుకథలు... చెప్పుకోండి చూద్దాం???

                     చెప్పుకోండి చూద్దాం




కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు .....ఏమిటవి?????



జవాబు :కనురెప్పలు


ఎన్ని కన్నులున్నా రెండు కన్నుల తోనే చూసేది .....ఏమిటది??????


 జవాబు: నెమలి




ఎముకలేని ప్రాణి ఏటి నీళ్లకు వచ్చే.... ఏమిటది????



జవాబు: జలగ


గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చేపోయే వారికి వడ్డించు బొమ్మ..... ఏమిటది?????


 జవాబు: తేలు


చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసిన వరదలు రావు.... ఏమిటవి ????


జవాబు: కన్నీరు


చిన్న ఇంటినిండా గులకరాళ్లు ....ఏమిటవి????



 జవాబు: నోటిలో  పళ్ళు



 చుర చుర కత్తులు సురారి కత్తులు--  రాజులు తెత్తురు   భామల కిత్తురు .....ఏమిటవి????

జవాబు: మొగలి పూవు

 జీవం లేని పక్షి ఊరు లెన్నో తిరుగుతుంది.... ఏమిటది?????

 జవాబు :ఉత్తరం


No comments:

Post a Comment

సూక్తులు

మీ చేతులను సేవకు, మీ హృదయాన్ని ప్రేమకు ఉపయోగించండి .. మదర్ థెరిస్సా నేను బతికినన్నాళ్లు నేర్చుకుంటూనే ఉంటాను ... రామకృష్ణ పరమహంస...