తెల్లటి పొలంలో నల్లని విత్తనాలు
చేత్తో చల్లుతారు నోటితో ఏరుకుంటారు...
ఏమిటది????
జవాబు పుస్తకం
అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది
మా ఇంటికొచ్చింది మహాలక్ష్మి లాగుంది ..
ఏమిటది ????
జవాబు గడప
అందరిని పైకి తీసుకు వెళతాను కానీ నేను పైకి వెళ్లలేను.....
జవాబు నిచ్చెన
ఆకు చిటికెడు.. కాయ మూరడు ఏమిటది???
జవాబు మునక్కాయ
కుడితి తాగదు మేత మేయదు కానీ కుండడు పాలు ఇస్తుంది... ఏమిటది????
జవాబు తాడిచెట్టు
సన్నని స్తంభం ...ఎక్కలేరు దిగలేరు..
ఏమిటది???
జవాబు సూది
కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు
అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు
ఏమిటది ????
జవాబు నత్త
తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర ..
ఏమిటది ???
జవాబు కొవ్వొత్తి









No comments:
Post a Comment