బాలింత అవునో కాదో పాలయితే ఉన్నాయి
ముక్కంటి అవునో కాదో జడలు అయితే ఉన్నాయి ఏమిటది ????
బావి నిండా నీరే.... పిట్ట కందదు ...ఎలుక కందదు ఏమిటది ????
జవాబు కొబ్బరి బొండం
అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
వంటినిండా గాయాలు
కడుపునిండా రాగాలు ....ఏమిటది????
జవాబు మురళీ
అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది..... ఏమిటది???
జవాబు చల్ల కవ్వం
ముక్కు మీదకి ఎక్కు
రెండు చెవులు నొక్కు
టక్కు నిక్కుల సోక్కు
జారిందంటే పుటుక్కు ...ఏమిటది??????
జవాబు కళ్ళజోడు
వేలెడంత ఉండదు కానీ మనం బయటకు వెళ్ళాలన్నా ఇంట్లోకి రావాలన్నా అది ఉండాల్సిందే ...ఏమిటది ?????
జవాబు తాళంచెవి
తెల్లని బంతి
చల్లని బంతి
ఎవరు ఆడని బంతి .....ఏమిటది?????
జవాబు చందమామ
నాలుగు కాళ్లు ఉంటాయి కానీ జంతువు కాదు..
రెండు చేతులు ఉంటాయి కానీ మనిషి కాదు...
ఏమిటది ?????
జవాబు కుర్చీ









No comments:
Post a Comment